BreakingLoading...
WhatsApp logo

Telugu Vaadi TV

Follow our WhatsApp Channel

Pawan kalyan: ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Deputy CM Pawan Kalyan visits the newly constructed Gollaprolu Housing Colony bridge in Pithapuram. Residents thank him for fulfilling his flood-time.
Pawan Kalyan Keeps Promise: Gollaprolu Bridge Completed, Decade-Long Hardship Ends


గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan


వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన

ఉప ముఖ్యమంత్రి కు థ్యాంక్స్ చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించిన కాలనీ వాసులు


పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సదర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సుద్ధగడ్డ కాలువపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో రూ. 3.05 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల శాఖ ఈ వంతెన నిర్మించింది. 2024 సెప్టెంబర్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా హౌసింగ్ కాలనీ సందర్శనకు వచ్చిన సందర్భంలో వరద ముంపులో ఉంది. 


పడవపై వెళ్లి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువకు వరద వచ్చిన ప్రతిసారి ముంపునకు గురవుతోందని, రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని హౌసింగ్ కాలనీ వాసులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చెప్పారు. వరదలు వచ్చిన ప్రతిసారి జనజీవనం స్తంభించిపోతుందని వాపోయారు. ఆ సందర్భంలో కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందించి హామీ నెరవేర్చారు. శుక్రవారం సంక్రాంతి మహోత్సవ వేదికపై లాంఛనంగా బ్రిడ్జిని ప్రారంభించి శనివారం పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ముంపు కష్టాలు తొలగించిన ఉప ముఖ్యమంత్రి కు కాలనీ వాసులు, స్కూలు పిల్లలు థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సర్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు.

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న పిఠాపురం MLA, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.


• 2024 వరదల సమయంలో పడవలో వెళ్ళి ముంపు ప్రాంతాన్ని సందర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

• బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ

• ఏడాది కాలంలోనే దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి

• సుద్ధగడ్డ కాలువపై రూ. 3.05 కోట్ల అంచనా వ్యయంతో వంతెన నిర్మాణం పూర్తి చేసిన R & B శాఖ 

• బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో విద్యార్థులకు, మహిళలకు, రైతులకు తొలగిన ఇబ్బందులు.

Post a Comment

We will remove clearly commercial or spam-like posts