BreakingLoading...
WhatsApp logo

Telugu Vaadi TV

Follow our WhatsApp Channel

సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. రెమ్యూనరేషన్ చూసి షాక్ అవుతారు!

హాలీవుడ్ బ్యూటీ సిడ్నీ స్వీని బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ. తొలి సినిమాకే ₹530 కోట్ల రెమ్యూనరేషన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

హాలీవుడ్ స్టార్ సిడ్నీ స్వీని ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేయబోతోంది. అంతే కాదు, ఈ ఎంట్రీతోనే ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురి చేసే రెమ్యూనరేషన్ టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, సిడ్నీ స్వీని తన తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం దాదాపు ₹530 కోట్ల భారీ పారితోషికం అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం హాలీవుడ్‌లో కూడా అగ్రశ్రేణి నటులు మాత్రమే అందుకునే స్థాయిలో ఉండటంతో చర్చనీయాంశమైంది.

బాలీవుడ్ సినీ విశ్లేషకులు మాత్రం ఈ మొత్తాన్ని ‘మార్కెటింగ్ స్ట్రాటజీ’గానే చూస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం సిడ్నీ స్వీని రాకతో బాలీవుడ్‌లో గ్లోబల్ స్టాండర్డ్ పెరుగుతుందని ఉత్సాహంగా ఉన్నారు.

ఇక ఈ ప్రాజెక్ట్ వివరాలు ఇంకా బయటకు రాకపోయినా, సిడ్నీ స్వీని డెబ్యూ సినిమా గురించి ఇప్పటికే ఇంటర్నెట్‌లో హైప్ క్రియేట్ అయ్యింది. వాస్తవం ఏదైనా.. ప్రస్తుతం ఆమె పారితోషికం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

About the author

Mandava Sai Kumar
Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment

We will remove clearly commercial or spam-like posts