ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’పై మరో కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ సినిమా ఇకపై పాంగల్ 2026 రేస్లో ఉండదని తెలుస్తోంది.
సినిమా యూనిట్ అంతర్గత సమాచారం ప్రకారం, ‘రాజాసాబ్’ను ఇప్పుడు ఏప్రిల్ 10 లేదా 14, 2026న విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో మరో పెద్ద సినిమా సూర్య – కరుప్పు కూడా రిలీజ్ కానుంది.
దీంతో ప్రభాస్ vs సూర్య బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ ఖాయం అవుతుందా అన్న ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు ప్రభాస్ పాన్-ఇండియా క్రేజ్.. మరోవైపు సూర్య మాస్ అట్రాక్షన్ కలిసివస్తే, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురుస్తుందనే అంచనాలు ఉన్నాయి.
అయితే అధికారిక రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. నిర్మాతల నుంచి క్లారిటీ వచ్చే వరకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్లాష్ నిజమైతే, ఇది 2026లోని అతిపెద్ద బాక్సాఫీస్ వార్ అవడం ఖాయం.