దక్షిణ భారత సినీ అభిమానులకు భారీ సర్‌ప్రైజ్. రజనీకాంత్ – కమల్ హాసన్ ఇద్దరూ కలిసి నటించే మల్టీస్టారర్ సినిమా ప్రిపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ కాంబినేషన్‌తో వస్తున్న సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొదట్లో ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తారని టాక్ వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆయన ఈ ప్రాజెక్ట్ చేయడం లేదు. దీంతో ఈ మల్టీస్టారర్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పుడు వినిపిస్తున్న బలమైన సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రదీప్ ప్రస్తుతం LIK మరియు Dude సినిమాల్లో నటన పూర్తి చేసుకున్న తర్వాత కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయనే రజనీ – కమల్ సినిమా డైరెక్టర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక ఈ వార్త బయటకు రాగానే అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఎందుకంటే, రజనీకాంత్ – కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడమే పెద్ద ఉత్సవం. ఇప్పుడు ఈ కాంబోకు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం జతకావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.