'కల్ట్' విలన్ వివేక్ చేపూరి హీరోగా: తెలుగు-తమిళ భాషల్లో భారీ చిత్రం

'కల్ట్', 'ఫలక్‌నుమా దాస్' విలన్ వివేక్ చేపూరి హీరోగా. టి. శరత్ చంద్ర దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. నవంబర్‌లో గ్లింప్స్.
'కల్ట్' విలన్ వివేక్ చేపూరి హీరోగా: తెలుగు-తమిళ భాషల్లో భారీ చిత్రం
‘ఫలక్‌నుమా దాస్’లో ‘రవి’ పాత్రతో, ఇటీవల ‘కల్ట్’ చిత్రంలో ‘ఇషాన్’ పాత్రతో ప్రేక్షకులను అలరించిన వివేక్ చేపూరి ఇప్పుడు హీరోగా అడుగుపెడుతున్నారు. దర్శకుడు టి. శరత్ చంద్ర తెరకెక్కిస్తున్న ఓ భారీ ప్రాజెక్టుతో ఆయన మెయిన్ లీడ్‌గా మారనున్నారు. విలన్‌గా రాణించి.. హీరోగా 2019లో వచ్చిన ‘ఫలక్‌నుమా దాస్’లో విశ్వక్ సేన్‌కు ఎదురుగా నిలిచిన ‘రవి’ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న వివేక్ చేపూరి, విశ్వక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్ట్’లో ‘ఇషాన్’ పాత్రతో మరింత రెచ్చిపోయారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసినప్పటికీ ఆయన నటనకు వచ్చిన స్పందన అదిరిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పాత్రకు సంబంధించిన వీడియోలు, మాస్ రీల్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. చిత్ర వివరాలు తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. ప్రముఖ ఛాయాగ్రహకుడు ప్రియేష్ గురుస్వామి కెమెరా పనిచేస్తున్నారు. హీరోగా వివేక్ చేపూరి విస్వరూపాన్ని చూపించే పవర్‌ఫుల్ గ్లింప్స్ లేదా టీజర్‌ను ఈ నవంబర్‌లోనే విడుదల చేయేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.