రాప్తాడు బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది: మంత్రి నారా లోకేష్
రాప్తాడు ఘటనలో గాయపడిన బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. వార్డుకు మార్చే అవకాశముందన్నారు.
రాప్తాడు బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది: మంత్రి నారా లోకేష్
అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె వేగంగా కోలుకుంటోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆమెకు బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై లోకేష్ ఎక్స్ వేదికగా తాజా సమాచారాన్ని పంచుకున్నారు. సోమవారం వార్డుకు మారే అవకాశం "బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. బాగా నిద్రపోతోంది, గొంతు ద్వారా ఆహారం తీసుకునే సామర్థ్యం పెరుగుతోంది, పడక పక్కనే ఫిజియోథెరపీ, కదలిక వ్యాయామాల్లో పాల్గొంటోంది. గాయాలపై డ్రెస్సింగ్ మార్చిన తరువాత వైద్యులు ఆమెను వార్డుకు తరలించే అవకాశం ఉంది" అని ఆదివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. శస్త్ర, వైద్య, సంరక్షణ బృందాలు ఆమె నొప్పి నివారణ, కోలుకునే పరిమితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. వైద్య బృందం అందిస్తున్న సేవలకు, రాష్ట్రవ్యాప్తంగా ఆమె కోసం ప్రార్థనలు చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చికిత్సా ప్రస్థానం అక్టోబరు 31న ఈ ఘటన జరిగిన అనంతరం ఆమెను ముందు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఆ రాత్రే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య బృందంతో బెంగళూరుకు త…