'ఇట్లు అర్జున' ట్రైలర్ రిలీజ్ చేసిన Jr.NTR అనీష్‌ను అభినందించిన తారక్

అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఇట్లు అర్జున సినిమా ట్రైలర్‌ను Jr.NTR విడుదల చేశారు. తొలి సినిమాలోనే మాటలు లేని పాత్రను ఎంచుకున్న అనీష్‌ను తారక్.
'ఇట్లు అర్జున' ట్రైలర్ రిలీజ్ చేసిన Jr.NTR అనీష్‌ను అభినందించిన తారక్
యువ కథానాయకుడు అనీష్, మలయాళ నటి అనస్వర రాజన్ జంటగా నటించిన ‘ఇట్లు అర్జున’ సినిమా ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. నవంబర్ 4న సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను లాంచ్ చేసిన తారక్.. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా తొలి సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న అనీష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మొదటి సినిమాలోనే మాటలు లేకుండా నటించే పాత్రను ఎంచుకోవడం నిజంగా గొప్ప ధైర్యమని జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసించారు. కథపై నమ్మకంతో ఇలాంటి విభిన్నమైన పాత్రను ఎంచుకున్న అనీష్‌కు మంచి ఆరంభం లభించాలని ఆకాంక్షించారు. అలాగే సంగీత దర్శకుడు తమన్, అనస్వర రాజన్, దర్శకుడు మహేశ్ ఉప్పాల, సినిమాటోగ్రాఫర్ రాజా మహాదేవన్, నిర్మాత వెంకీ కుడుముల సహా మొత్తం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనీష్‌ను ప్రత్యేకంగా అభినందించిన ఎన్టీఆర్ ‘ఇట్లు అర్జున’ ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం ఎన్టీఆర్ తన సోషల్ మీడియా పోస్టులో అనీష్ నటనను ప్రశంసించారు. తొలి సినిమాలోనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా పాత్రను పోషించాల్సి ఉండటం సవాల్‌తో కూడుకున్నదని, అలాంటి పాత్రను ఎంచుకోవడం అనీష్‌లో కథపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తుందని పేర్కొన్…