డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్ లో గ్లోబల్ క్లైమేట్ కాన్ క్లేవ్

డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్ లో గ్లోబల్ క్లైమేట్ కాన్ క్లేవ్. హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం పంపే యోచనలో తెలంగాణ ప్రభుత్వం. వివరాలు ఇక్కడ.
డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్ లో గ్లోబల్ క్లైమేట్ కాన్ క్లేవ్
డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్ లో గ్లోబల్ క్లైమేట్ కాన్ క్లేవ్ (అంతర్జాతీయ వాతావరణ సదస్సు) నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 లో భాగంగా జరగనున్న ఈ సదస్సు ఏర్పాట్లపై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం (నవంబర్ 9) సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ప్రముఖులకు ఆహ్వానం పర్యావరణ పరిరక్షణ, వాతావరణ చర్యలతో ముడిపడి ఉన్న ప్రపంచ ప్రసిద్ధులకు ఆహ్వానాలు పంపేలా అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రముఖ జల సంరక్షకుడు రాజేంద్ర సింగ్ , పర్యావరణవేత్త సునితా నరైన్ , సద్గురు , నార్వే మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్ హీమ్ , బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త దియా మీర్జా లకు ఆహ్వానం పంపే అంశం పరిశీలనలో ఉంది. హాలీవుడ్ ప్రముఖుల పేర్లను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. కేంద్ర మంత్రులు, నార్వే, డెన్మార్క్, స్వీడన్ రాయబారులను కూడా ఆహ్వానించే యోచనలో ఉన్నారు. ఎల్ నీనో సిద్ధతపై ప్రత్యేక దృష్టి సదస్సులో ఎల్ నీనో ప్రభావానికి తెలంగాణ సిద్ధత ప్రధాన అంశంగా ఉంటుంది. దీర్ఘకాలిక కరువు, తాగునీటి కొరత, వ్యవసాయ ఇబ్బందులు, పెరిగే విద్యుత్ డిమాండ్ పై చర్చ జరుగుతుంది.…