Dhanush Om Movie: ధనుష్ ‘ఓమ్’ నుంచి థర్డ్ సింగిల్ ‘సెంజుదారే’ రిలీజ్

ధనుష్, శ్రీలీల, సాయిపల్లవి నటిస్తున్న ‘ఓమ్’ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘సెంజుదారే’ విడుదలైంది. సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ మెలోడీ పాటకు.
Dhanush Om Movie: ధనుష్ ‘ఓమ్’ నుంచి థర్డ్ సింగిల్ ‘సెంజుదారే’ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓమ్’ నుంచి మరో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్‌కుమార్ పెద్దసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన థర్డ్ సింగిల్ ‘సెంజుదారే’ ను మేకర్స్ నవంబర్ 4న విడుదల చేశారు. ధనుష్, శ్రీలీల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాట ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. మెలోడీ టచ్‌తో సాగుతున్న ‘సెంజుదారే’ పాటకు సాయి అభ్యంకర్ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. పాటకు ఆదేష్ కృష్ణ సాహిత్యం అందించారు. ‘సెంజుదారే’లో శ్రీలీల ‘ఓమ్’ సినిమాలో శ్రీలీల ‘రోజా’ అనే పాత్రలో కనిపించనుంది. థర్డ్ సింగిల్ విడుదలకు ముందు మేకర్స్ శ్రీలీల పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ‘సెంజుదారే’ పాటలో శ్రీలీలకు సంబంధించిన విజువల్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ధనుష్‌తో పాటు మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ‘ఓమ్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే రెండు పాటలు హిట్ ‘ఓమ్’ నుంచి ఇప్పటికే ‘అలాకా లూవా’ , ‘వీజా వీరా’ పాటలు విడ…