ఆధ్యాత్మిక చిత్రం 'శివాలయం' టీజర్, పోస్టర్ హైదరాబాద్లో విడుదల. ఆచంట మహేష్, కాంచన దీప్తిరెడ్డి జంటగా నటిస్తున్న భక్తిరస చిత్రం.
'శివాలయం' మూవీ టీజర్, పోస్టర్ విడుదల
ఆధ్యాత్మిక నేపథ్యంతో తెరకెక్తున్న తెలుగు చిత్రం 'శివాలయం' టీజర్, పోస్టర్ శనివారం హైదరాబాద్లో విడుదలయ్యాయి. శివుడి మహిమలను కథాంశంగా చేసుకుని రూపొందుతున్న ఈ భక్తి చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. టీజర్ విడుదల కార్యక్రమానికి చిత్రబృంద సభ్యులు, సినీ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు. వెంకట్ రెడ్డి నంది దర్శకత్వం, నిర్మాణం ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఇది 11వ చిత్రం. 'రంగస్థలం' చిత్రంతో గుర్తింపు పొందిన ఆచంట మహేష్ హీరోగా, కాంచన దీప్తిరెడ్డి హీరోయిన్గా నటిస్తున్నారు. నటుడు ఘర్షణ శ్రీనివాస్, నటుడు-నిర్మాత లెంకల అశోక్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర కథ, ఇతర నటీనటులు, సాంకేతిక వివరాలను చిత్రబృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఆగస్టులో ప్రారంభమైన చిత్రం ఈ చిత్రం ఆగస్టులో ఫిలిం ఛాంబర్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమై, సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. "శివుడి లీలలు, మహిమలు, భక్తి భావనను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. భక్తితో పాటు మంచి కథ, భావోద్వేగాలు, వినోద…