12వ పీఆర్సీ: కొత్త పోస్టుల సృష్టి, అప్‌గ్రేడేషన్‌లపై బ్రేకులు

12వ పీఆర్సీ ఉత్తర్వులు వచ్చేవరకు కొత్త పోస్టుల సృష్టి, అప్‌గ్రేడేషన్, గెజెటెడ్ హోదా ప్రతిపాదనలు వాయిదా వేయాలని ఏపీ ఆర్థిక శాఖ సర్క్యులర్.
12వ పీఆర్సీ: కొత్త పోస్టుల సృష్టి, అప్‌గ్రేడేషన్‌లపై బ్రేకులు
12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) పదవీకాలంలో కొత్త పోస్టుల సృష్టి, పోస్టుల అప్‌గ్రేడేషన్, రీడెజిగ్నేషన్, ఏ వర్గానికైనా గెజెటెడ్ హోదా కల్పించే ప్రతిపాదనలను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక (పీసీ అండ్ టీఏ) శాఖ సూచించింది. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9, 2026) సర్క్యులర్ మెమో (నెం. FIN01-HR0PCTA/2/2026) జారీ చేసింది. సర్క్యులర్ ఏం చెబుతోంది? పీఆర్సీ పదవీకాలంలో పోస్టుల సృష్టి, అప్‌గ్రేడేషన్, రీడెజిగ్నేషన్, గెజెటెడ్ హోదా వంటి మార్పులు చేయడం సరైనది కాదని ఆర్థిక శాఖ పేర్కొంది. వివిధ వర్గాల మధ్య పారిటీ, ఈక్విటీ కుదుర్చే పీఆర్సీ పనితీరును ఇలాంటి మార్పులు క్లిష్టతరం చేస్తాయని తెలిపింది. ఇంతలో సిబ్బంది నిర్మాణంలో చేసే మార్పులు పీఆర్సీ సిఫార్సుల్లో ప్రతిబింబించకపోవడంతో వక్రీకరణలకు దారితీయవచ్చని పేర్కొంది. ఎవరికి, ఏం సూచన? అన్ని సెక్రటేరియట్ శాఖలు, అన్ని శాఖాధిపతులు ఈ నిబంధనలు పాటించాలి 12వ పీఆర్సీ సిఫార్సులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈ విధమైన ప్రతిపాదనలను వాయిదా వేయాలి సర్క్యులర్‌పై సెక్రటరీ టు గవర్నమెంట్ వడరేవు వినయ్ చంద్ సంతకం చేశారు ఈ సర్క్యులర్ నకళ్లు పే రివిజన్ కమిషనర్, పీఆర్సీ సెక్రటరీకి కూడా …