యలహంక ప్రాపర్టీ నాదే షర్మిల సంచలన ట్వీట్

యలహంక ప్రాపర్టీపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల పంపకాల్లో 100 శాతం తనకు, తన పిల్లలకు వచ్చిందని తెలిపారు.
యలహంక ప్రాపర్టీ నాదే షర్మిల సంచలన ట్వీట్
YS Sharmila On Yelahanka Property: యలహంక ప్రాపర్టీ, తన కుమార్తె వివాహ వేదిక అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలకంగా స్పందించారు. తనది కాని ఆస్తి కోసం ఆశపడే నీచత్వం తనకు లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల పంపకాల్లో భాగంగా యలహంక ప్రాపర్టీ పూర్తిగా తనకు, తన పిల్లలకు వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహాన్ని యలహంకలోని ఇంట్లోనే నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో వేదికను మార్చినట్లు షర్మిల వెల్లడించారు. ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా కుమార్తె వివాహాన్ని నిర్వహించడమే తమ బాధ్యత అని తెలిపారు. ‘నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’ యలహంక ప్రాపర్టీపై తన వైఖరిని స్పష్టం చేస్తూ షర్మిల తన సోషల్ మీడియా పోస్టులో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనది కాని ఆస్తి కోసం తాను ఆశపడబోనని పేర్కొన్నారు. తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత , అప్పటివరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా తనకు, తన పిల్లల వాటాకు వచ్చిందని షర్మిల తెలిపారు. ఇది దేవుడి సాక్షిగా న…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment