తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కీలక ముందడుగు 152 మీటర్ల ప్రతిపాదనపై సానుకూలంగా మహారాష్ట్ర సీఎం
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలన్న తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కీలక ముందడుగు 152 మీటర్ల ప్రతిపాదనపై సానుకూలంగా మహారాష్ట్ర సీఎం
తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కీలక ముందడుగు 152 మీటర్ల ప్రతిపాదనపై సానుకూలంగా మహారాష్ట్ర సీఎం హైదరాబాద్/ముంబై: తెలంగాణకు అత్యంత కీలకంగా భావిస్తున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలన్న తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. అయితే తుది నిర్ణయానికి ముందు నీటి లభ్యత, ముంపు ప్రభావం, వ్యవసాయ భూములపై ప్రభావం, పరిహారం, సాంకేతిక, పర్యావరణ, పరిపాలన అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరమని స్పష్టం చేశారు. ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో సమావేశమైంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ప్రధాన చర్చ తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ప్రాణహిత నదిపై ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణమే ఈ సమావేశంలో ప్రధాన అంశంగా మారింది. ముఖ్యంగా బ్యారేజీ…