‘ట్రంప్ నన్ను రేప్ చేశారు’ మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ కియోల్ సంచలన ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ కాంటెస్టెంట్ బియాట్రిస్ కియోల్ సంచలన లైంగిక దాడి ఆరోపణలు చేశారు. 1993లో న్యూయార్క్‌లోని
‘ట్రంప్ నన్ను రేప్ చేశారు’ మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ కియోల్ సంచలన ఆరోపణలు
‘ట్రంప్ నన్ను రేప్ చేశారు’ మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ కియోల్ సంచలన ఆరోపణలు అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ కాంటెస్టెంట్, మోడల్ బియాట్రిస్ కియోల్ చేసిన ఆరోపణలు అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 1993లో న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశారని ఆమె అమెరికా కాంగ్రెస్ సిబ్బందికి ఇచ్చిన వాంగ్మూలంలో ఆరోపించినట్లు తాజాగా విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. జెఫ్రీ ఎప్స్టీన్‌తో ట్రంప్‌కు ఉన్న సంబంధాలపై అమెరికా హౌస్ జ్యుడీషియరీ కమిటీ డెమొక్రాటిక్ సభ్యులు విడుదల చేసిన నివేదికలో బియాట్రిస్ కియోల్ వాంగ్మూలాన్ని పొందుపరిచారు. అయితే ఈ ఆరోపణలు కోర్టులో నిర్ధారణ కాలేదు . ఈ ఆరోపణలను వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌పై ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి క్రిమినల్ ఛార్జీ నమోదు కాలేదు. 1993 ఘటనపై బియాట్రిస్ కియోల్ ఆరోపణలు కాంగ్రెస్ సిబ్బందికి కియోల్ వివరించిన కథనం ప్రకారం 1993 నవంబర్‌లో ఆమె 24 ఏళ్ల మోడల్‌గా అమెరికాకు వెళ్లారు. డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన American Dream Pageant కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమెను ఆహ్వానించినట్లు నివేదిక పేర్కొం…