పోలీసు అమరవీరుల సంస్మరణ దినం: 2028లోగా పోలీస్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం: 2028లోగా పోలీస్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం: 2028లోగా పోలీస్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి Police Commemoration Day: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోలీసు అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని సీఎం పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. 2028లోగా పోలీస్ శాఖలో అన్ని ఖాళీలు భర్తీ పోలీసు శాఖలో సిబ్బంది కొరత లేకుండా చేసేందుకు విడతలవారీగా నియామకాలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2028లోగా పోలీస్ శాఖలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసి సిబ్బంది కొరత లేకుండా చేస్తామని ప్రకటించారు. 2025 అక్టోబర్ నాటికి దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లు, ఎస్ఐలను నియమించినట్లు సీఎం తెలిపారు. సిబ్బంది కొరతను తగ్గించేందుకు కొత్త నియ…