సూర్యదేవర నాగ వంశీ – వైష్ణవి చైతన్య మధ్య అసలు ఏం జరుగుతుంది. వరుస సినిమా ఛాన్స్ లకు కారణం అదేనా?

ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ, హీరోయిన్ వైష్ణవి చైతన్య మధ్య ఏదో జరుగుతోందంటూ Reddit, సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
సూర్యదేవర నాగ వంశీ – వైష్ణవి చైతన్య మధ్య అసలు ఏం జరుగుతుంది. వరుస సినిమా ఛాన్స్ లకు కారణం అదేనా?
టాలీవుడ్‌లో రూమర్స్‌కు కొదవ ఉండదు. హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత. ఎవరైనా సరే వరుసగా కలిసి పనిచేస్తే చాలు. వారి మధ్య ఏదో జరుగుతోందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలవుతుంది. తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ , హీరోయిన్ వైష్ణవి చైతన్య పేర్లు కూడా ఇలాంటి సోషల్ మీడియా ప్రచారంలో వినిపిస్తున్నాయి. Reddit వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో మొదలైన కొన్ని గాసిప్స్ ప్రస్తుతం ఇతర సోషల్ మీడియా వేదికలకు కూడా చేరడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తాజాగా Xలో కూడా దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఉన్న వ్యక్తిగత ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అసలు రూమర్ ఏంటి? సూర్యదేవర నాగ వంశీ, వైష్ణవి చైతన్య మధ్య ప్రత్యేకమైన వ్యక్తిగత సంబంధం ఉందంటూ కొన్ని నెటిజన్ పోస్టులు, Reddit చర్చలు ఊహాగానాలకు తెరలేపాయి. వైష్ణవి చైతన్యకు వరుసగా అవకాశాలు రావడానికి నిర్మాతతో ఉన్న వ్యక్తిగత పరిచయమే కారణమని కొందరు సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియా రూమర్స్ మాత్రమే . వ్యక్తిగత సంబంధం ఉందని నిర్ధారించే విశ్వసనీయ ఆధారం లేదా సంబంధిత వ్యక్తుల అ…