నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు

KBC 18లో అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాలను వెల్లడించారు.
నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు
Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి తన వ్యక్తిగత అభిరుచులు, జీవిత భాగస్వామిపై తన ఆలోచనలను తాజాగా పంచుకున్నారు. ప్రముఖ క్విజ్ షో Kaun Banega Crorepati 18 (KBC) లో అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు ఆమె తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారో వివరించారు. పెద్దగా డిమాండ్ల జాబితా ఏమీ లేదని చెబుతూనే.. వ్యక్తిత్వానికి మాత్రం ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. మంచి మనసు ఉండాలి స్వార్థం ఉండకూడదు జీవిత భాగస్వామిగా ఎలాంటి వ్యక్తిని కోరుకుంటారని అమితాబ్ బచ్చన్ ప్రశ్నించగా.. ముందుగా అతను మంచి మనిషి అయి ఉండాలని సాయి పల్లవి చెప్పారు. తనకు కాబోయే వ్యక్తి చాలా స్వార్థపూరితంగా ఉండకూడదని, ఇతరుల గురించి కూడా ఆలోచించే మనస్తత్వం ఉండాలని పేర్కొన్నారు. అలాగే తన ప్రవర్తనను, తాను చేసే పనులను ఒకసారి ఆలోచించుకుని చూసుకునే ఆత్మపరిశీలన గుణం ఉండాలని ఆమె చెప్పారు. జీవితంలో తన చర్యలను తానే పరిశీలించుకుని, ఎక్కడ తప్పు జరిగిందో అర్థం చేసుకునే వ్యక్తిత్వం తనకు ముఖ్యమని సాయి పల్లవి వివరించారు. తప్పులు చేస్తే సరిదిద్దుకోవాలి మనిషి అన్నాక తప్పులు చేయడం సహజమేనని సాయి పల్లవి అభిప్రాయపడ్డారు. అయితే తప్పు చేసిన తర్వాత దాన్ని అంగ…