రోహిత్, కోహ్లి వయసుతో సంబంధం లేదు 2027 వరల్డ్ కప్‌పై BCCI ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు

2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఎంపికపై BCCI ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెలక్షన్‌లో వయసు కంటే ఫిట్‌నెస్.
రోహిత్, కోహ్లి వయసుతో సంబంధం లేదు 2027 వరల్డ్ కప్‌పై BCCI ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
రోహిత్, కోహ్లి వయసుతో సంబంధం లేదు 2027 వరల్డ్ కప్‌పై BCCI ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు Rohit Sharma-Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు భారత జట్టులో ఉంటారా? అనే ప్రశ్నలకు BCCI ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సెలక్షన్ సమయంలో ఆటగాళ్ల వయసు కంటే ఫిట్‌నెస్, ప్రస్తుత ఫామ్, పర్ఫార్మెన్స్ కే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. రోహిత్, కోహ్లి ఫిట్‌గా ఉండి, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, వరల్డ్ కప్ వరకు తమ ఫామ్‌ను కొనసాగిస్తే జట్టులో ఉండే అవకాశాలు ఉంటాయని ఆయన వ్యాఖ్యల సారాంశం. ‘వయసుతో సంబంధం లేదు’.. ఫిట్‌నెస్, పర్ఫార్మెన్స్ ముఖ్యం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఎంపికపై మాట్లాడిన మిథున్ మన్హాస్.. సెలక్షన్‌కు వయసు ప్రధాన ప్రమాణం కాదని స్పష్టం చేశారు. ఆటగాడు ఎంత వయసులో ఉన్నాడన్నదానికంటే అతను ఫిట్‌గా ఉన్నాడా? మ్యాచ్‌ల్లో ఎలా ఆడుతున్నాడు? జట్టు విజయానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాడు? అనే అంశాలనే పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంటే 202…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment