వరి పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనందబాబు రైతులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్న నేత
ఆర్నబ్ తుఫాను ప్రభావంతో జంపని నుంచి వేమూరు మధ్య నేలకొరిగిన వరి పంట పొలాలను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పరిశీలించారు.
వరి పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనందబాబు రైతులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్న నేత వేమూరు: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తుండటంతో వ్యవసాయ పంటలపై ప్రభావం పడింది. ముఖ్యంగా కోత దశకు చేరుకున్న వరి పంటలు గాలుల తీవ్రతకు కొన్ని ప్రాంతాల్లో నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో వేమూరు నియోజకవర్గంలోని జంపని నుంచి వేమూరు మధ్య ప్రాంతాల్లో నేలకొరిగిన వరి పంట పొలాలను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బుధవారం పరిశీలించారు. పంట పొలాల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే స్వయంగా పరిస్థితిని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. పంట ఏ దశలో ఉంది, ఎంత మేరకు నేలకొరిగింది, పొలాల్లో నీటి పరిస్థితి ఎలా ఉంది వంటి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్నబ్ తుఫాను ప్రభావంతో వరి పంట నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆనందబాబు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై వివరాలు సేకరించారు. వరి పంట నేలకొరిగినప్పటికీ ప్రస్తుతం పొలాల్లో నీరు ఎక్కువగా నిల్వ లేకపోవడం కొంత ఉపశమనంగా ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పొలాల్లో నీరు ఎక్కువగా నిలిచిపోకపోతే పంటకు జరిగే నష్టం తక్కువగ…