'కశ్మీర్ అప్పటి నుంచి చీకటిలోనే ఉంది' భారత్‌పై పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యలు

కశ్మీర్ బ్లాక్ డే సందర్భంగా పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1947లో భారత సేనలు శ్రీనగర్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి.
'కశ్మీర్ అప్పటి నుంచి చీకటిలోనే ఉంది' భారత్‌పై పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యలు
'కశ్మీర్ అప్పటి నుంచి చీకటిలోనే ఉంది' భారత్‌పై పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యలు అంతర్జాతీయం: కశ్మీర్ అంశంపై భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అక్టోబర్ 27ను పాకిస్థాన్‌లో ‘కశ్మీర్ బ్లాక్ డే’ గా పాటిస్తున్న నేపథ్యంలో పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ భారత్‌పై విమర్శలు చేశారు. 1947లో భారత సేనలు శ్రీనగర్‌లో అడుగుపెట్టిన ఘటనతో జమ్మూ కశ్మీర్‌లో ఒక విషాదకర అధ్యాయం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ తమ హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని కోల్పోలేదని షెహ్‌బాజ్ షరీఫ్ అన్నారు. కశ్మీరీ ప్రజలకు పాకిస్థాన్ రాజకీయ, దౌత్య, నైతిక మద్దతు కొనసాగుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ‘1947 నుంచి విషాదకర అధ్యాయం’ షరీఫ్ జమ్మూ కశ్మీర్ బ్లాక్ డే సందర్భంగా విడుదల చేసిన సందేశంలో షెహ్‌బాజ్ షరీఫ్ 1947 అక్టోబర్ 27న భారత సేనలు శ్రీనగర్‌లోకి ప్రవేశించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ ఘటన కశ్మీర్ చరిత్రలో ఒక విషాదకర అధ్యాయానికి నాంది పలికిందని, దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయ హక్కు విషయంలో పాక…