కర్ణాటకలో 99.32 లక్షల ఓట్ల తగ్గింపు ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల

కర్ణాటకలో SIR ప్రక్రియ అనంతరం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.54 కోట్ల నుంచి 4.55 కోట్లకు.
కర్ణాటకలో 99.32 లక్షల ఓట్ల తగ్గింపు ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల
కర్ణాటకలో 99.32 లక్షల ఓట్ల తగ్గింపు ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల బెంగళూరు: కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR) పూర్తయింది. ఎన్నికల అధికారులు మంగళవారం తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. SIRకు ముందు ఉన్న 5,54,32,314 మంది ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 4,55,00,011కి చేరింది. అంటే దాదాపు 99.32 లక్షల మేర తగ్గుదల నమోదైంది. కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వి. అన్బుకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, తుది ఓటర్ల జాబితా నిర్ణీత ప్రక్రియలో భాగంగా నోటీసులు, విచారణలు, అభ్యంతరాల పరిశీలన అనంతరం విడుదలైంది. SIR ప్రక్రియలో అర్హతను నిర్ధారించేందుకు అధికారులు పలు దశల్లో పరిశీలన చేపట్టారు. 4.55 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య SIR ప్రారంభానికి ముందు కర్ణాటకలో 5,54,32,314 మంది ఓటర్లు ఉన్నారు. తుది జాబితాలో ఈ సంఖ్య 4,55,00,011 గా నమోదైంది. దీంతో మొత్తం సంఖ్యలో 99.32 లక్షల తగ్గుదల కనిపించింది. అయితే ఈ మొత్తం తగ్గుదలను కేవలం చివరి దశలో జరిగిన తొలగింపులుగా చూడకూడదని అధికారులు వెల్లడించిన వివరాలు సూచిస్తున్నాయి. ముసాయిదా జాబితా విడుదల తర్వాత అర్హుల…