Jio Platforms IPO Listing: 21% ప్రీమియంతో అదిరిపోయే ఎంట్రీ అనంత్ అంబానీ స్పీచ్‌కు ముకేశ్ అంబానీ ఎమోషనల్

Jio Platforms షేర్లు ₹1,358 వద్ద లిస్ట్ అయి IPO ధరపై 21.36% ప్రీమియం నమోదు చేశాయి. అనంత్ అంబానీ స్పీచ్ సందర్భంగా ముకేశ్ అంబానీ ఎమోషనల్ అయ్యారు.
Jio Platforms IPO Listing: 21% ప్రీమియంతో అదిరిపోయే ఎంట్రీ అనంత్ అంబానీ స్పీచ్‌కు ముకేశ్ అంబానీ ఎమోషనల్
Jio Platforms IPO Listing: భారత స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్, టెలికాం విభాగమైన Jio Platforms అదిరిపోయే అరంగేట్రం చేసింది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 28న NSE, BSEలో లిస్టయిన జియో ప్లాట్‌ఫార్మ్స్ షేర్లు ఇన్వెస్టర్లకు తొలి రోజే మంచి లాభాన్ని అందించాయి. IPOలో ఒక్కో షేర్‌కు ₹1,119 గా నిర్ణయించిన ధరతో పోలిస్తే, Jio Platforms షేర్ ₹1,358 వద్ద లిస్ట్ అయింది. దీంతో లిస్టింగ్ సమయంలోనే 21.36 శాతం ప్రీమియం నమోదైంది. భారీ స్థాయి IPO తర్వాత వచ్చిన ఈ లిస్టింగ్‌పై మార్కెట్ వర్గాల్లో ముందుగానే ఆసక్తి నెలకొంది. ₹30,213 కోట్ల భారీ IPO Jio Platforms పబ్లిక్ ఇష్యూ విలువ సుమారు ₹30,213 కోట్లు . ఈ IPOకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం ఇష్యూ 22 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ కావడం మార్కెట్‌లో Jioపై ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపించింది. లిస్టింగ్‌తో Jio Platforms మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు ₹12.5 లక్షల కోట్ల స్థాయికి చేరింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత భారతదేశంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీల్లో Jio Platforms రెండో స్థానంలో నిలిచింది. లిస్టింగ్ వేడుకలో అంబానీ కుటుంబం Jio Platfor…