‘డియర్ షర్మీ’ షర్మిలకు జగన్ లేఖ అంజలి పెళ్లి వేదికపై కీలక వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల కుమార్తె అంజలి వివాహ వేదికపై నెలకొన్న వివాదం నేపథ్యంలో వైఎస్ జగన్ అక్టోబర్ 9న షర్మిలకు రాసిన ‘డియర్ షర్మీ’ లేఖను వైసీపీ విడుదల చేసింది.
‘డియర్ షర్మీ’ షర్మిలకు జగన్ లేఖ అంజలి పెళ్లి వేదికపై కీలక వ్యాఖ్యలు
‘డియర్ షర్మీ’ షర్మిలకు జగన్ లేఖ అంజలి పెళ్లి వేదికపై కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్ జగన్, వైఎస్ షర్మిల కుటుంబ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. షర్మిల కుమార్తె అంజలి వివాహ వేదిక విషయంలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలకు అక్టోబర్ 9న రాసిన లేఖను పార్టీ విడుదల చేసింది. ‘ డియర్ షర్మీ ’ అంటూ ప్రారంభమైన ఈ లేఖలో అంజలి వివాహంపై జగన్ సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, బెంగళూరులోని తన నివాసంలో పెళ్లి నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భద్రత, కుటుంబ గోప్యతకు సంబంధించిన అంశాలను ఆయన తన లేఖలో వివరించారు. ‘డియర్ షర్మీ’ అంటూ జగన్ లేఖ వైసీపీ విడుదల చేసిన లేఖ ప్రకారం.. షర్మిల కుమార్తె అంజలి వివాహం జరగనున్న విషయం తనకు సంతోషాన్ని కలిగించిందని జగన్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, అంజలి జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే అంజలి వివాహాన్ని బెంగళూరులోని తన నివా…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment