IPL 2027కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక ప్లేయర్ ట్రేడ్ జరిగింది. టి. నటరాజన్ తిరిగి SRHలోకి వచ్చారు. జీషన్ అన్సారీ DCలోకి
IPL 2027: SRHలోకి నటరాజన్ రీఎంట్రీ.. DCకి వెళ్లిన జీషన్ అన్సారీ
IPL 2027: SRHలోకి నటరాజన్ రీఎంట్రీ.. DCకి వెళ్లిన జీషన్ అన్సారీ Breaking News: ఐపీఎల్లో కీలక ప్లేయర్ ట్రేడ్ జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ట్రేడ్‌లో భారత ఎడమచేతి వాటం పేసర్ టి. నటరాజన్ తిరిగి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చారు. మరోవైపు లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి వెళ్లారు. రాబోయే ఐపీఎల్ సీజన్‌కు ముందు ఇరు జట్లు తమ బౌలింగ్ విభాగాలను మార్చుకునే క్రమంలో ఈ ట్రేడ్ జరిగింది. SRHలోకి నటరాజన్ రీఎంట్రీ టి. నటరాజన్ మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీలో కనిపించనున్నారు. 2020 నుంచి 2024 వరకు ఐదు సీజన్ల పాటు నటరాజన్ SRH తరఫున ఆడారు. ఈ కాలంలో తన ఖచ్చితమైన యార్కర్లు, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సామర్థ్యంతో జట్టులో కీలక బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2024 సీజన్ నటరాజన్‌కు ప్రత్యేకంగా నిలిచింది. ఆ సీజన్లో ఆయన 19 వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. ఆ సీజన్లో SRH ఫైనల్ వరకు చేరడంలో ఆయన బౌలింగ్ కూడా కీలకంగా నిలిచింది. 2025 వేలంలో రూ.10.75 కోట్లకు DCలోకి 2025 ఐపీఎల్ ప్లేయర్ వేలంలో ఢిల్లీ క్యా…