అభిషేక్‌కు బ్రేక్ ఇచ్చి వైభవ్‌ను ఆడించాలి: దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు
న్యూజిలాండ్‌తో నాలుగో T20లో వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టడంపై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్‌ను ఆడించాలంటే అభిషేక్ శర్మకు
అభిషేక్‌కు బ్రేక్ ఇచ్చి వైభవ్‌ను ఆడించాలి: దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు Vaibhav Suryavanshi: న్యూజిలాండ్‌తో జరుగుతున్న T20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై చర్చ కొనసాగుతోంది. మూడో T20లో కేవలం 19 బంతుల్లో 45 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్‌ను నాలుగో T20లో భారత జట్టు పక్కనపెట్టింది. గాయం నుంచి కోలుకున్న ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి రావడంతో వైభవ్‌కు చోటు దక్కలేదు. ఈ నిర్ణయంపై మాజీ భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ కీలక సూచన చేశారు. వైభవ్ కోసం అభిషేక్‌కు బ్రేక్ ఇవ్వాలి: DK వైభవ్‌ను కచ్చితంగా ఆడించాలనుకుంటే ప్రతిసారీ సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడం సరైన విధానం కాదని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. సిరీస్ ఇప్పటికే భారత్ చేతిలో ఉండటంతో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి బెంచ్ బలాన్ని పరీక్షించవచ్చని ఆయన సూచించారు. ముఖ్యంగా వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలంటే అభిషేక్ శర్మకు బ్రేక్ ఇవ్వడం ఒక మార్గమని కార్తీక్ చెప్పారు. వైభవ్ విషయంలో ప్రతిసారీ సంజూ శాంసన్‌నే త్యాగం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. మూడో T20లో వైభవ్ మెరుపులు వెల్లింగ్టన్లో జరిగిన మూడో T20లో వైభవ్ సూర్యవంశీ తన సత్తా చాటాడు. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన వైభవ్ కేవలం 19 బంతుల్లో 45 పరుగుల…