‘ధర్మన్’ మూవీ ఓటీటీ డీల్ రూ.150 కోట్లా? కమల్ హాసన్ నిర్మాణ సంస్థపై భారీ బిజినెస్ టాక్
రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్ మూవీ ఓటీటీ హక్కులకు రూ.150 కోట్ల డీల్ కుదిరిందనే ప్రచారం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది.
‘ధర్మన్’ మూవీ ఓటీటీ డీల్ రూ.150 కోట్లా? కమల్ హాసన్ నిర్మాణ సంస్థపై భారీ బిజినెస్ టాక్ సినిమా న్యూస్: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘ధర్మన్’ విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. రజినీకాంత్ హీరోగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సినిమాలో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కీలక పాత్రలో నటిస్తుండటంతో రెండు పరిశ్రమల్లోనూ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కుల విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘ధర్మన్’తో పాటు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో రెండు సినిమాల డిజిటల్ హక్కులకు భారీ ప్యాకేజీ డీల్ కుదిరిందనే వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి ఆర్థిక వివరాలను నిర్మాతలు లేదా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. ‘ధర్మన్’ ఓటీటీ డీల్ రూ.150 కోట్లా? కోలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ డిజిటల్ హక్కులకు సుమారు రూ.150 కోట్ల విలువ ఉందనే టాక్ నడుస్తోంది. అయితే ఇది సినిమా ఒక్కదాని ఓటీట…