ధనుష్ ‘OM Chapter 1’పై భారీ హైప్ నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్, సాయి పల్లవి పోలీస్ రోల్ స్పెషల్!
ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి నటించిన OM Chapter 1: Udhiram – The Blood Wood నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సాయి పల్లవి CBI అధికారి.
ధనుష్ ‘OM Chapter 1’పై భారీ హైప్ నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్, సాయి పల్లవి పోలీస్ రోల్ స్పెషల్! OM Chapter 1: తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘OM Chapter 1: Udhiram – The Blood Wood’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘అమరన్’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలవుతున్న ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా చుట్టూ బజ్ మరింత పెరుగుతోంది. ఈ చిత్రం తొలుత అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే రజినీకాంత్ నటించిన ‘Jailer 2’ తో నేరుగా పోటీని నివారించేందుకు మేకర్స్ రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు నవంబర్ 20, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాయి పల్లవి పాత్రపై స్పెషల్ ఫోకస్ ఈ సినిమాలో సాయి పల్లవి నిత్యారెడ్డి అనే పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదల కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. నిత్యారెడ్డి పాత్రకు నిజాయితీ, తెలివితేటలు, అనుభవం వంటి లక్షణాలను మేకర్స్ హైలైట్ చేశారు. కథలో ఆమె మొదట ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా…