తీరం దాటిన ‘అర్నబ్’ తుఫాన్ యానాం-నర్సాపురం మధ్య ల్యాండ్‌ఫాల్, ఏపీలో భారీ వర్షాలు
అర్నబ్ అతి తీవ్ర తుఫాన్ ఆంధ్రప్రదేశ్-యానాం తీరాన్ని దాటింది. యానాం నైరుతి ప్రాంతంలో నర్సాపురానికి సమీపంగా తీరం దాటిన తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింద
తీరం దాటిన ‘అర్నబ్’ తుఫాన్ యానాం-నర్సాపురం మధ్య ల్యాండ్‌ఫాల్, ఏపీలో భారీ వర్షాలు AP Cyclone Arnab: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ అతి తీవ్ర తుఫాన్ ఆంధ్రప్రదేశ్-యానాం తీరాన్ని దాటింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ఉదయం 8 గంటల సమయంలో పూర్తయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. యానాం నైరుతి వైపు, నర్సాపురానికి సమీప ప్రాంతంలో తుఫాన్ తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 125–135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా, గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వరకు గాలులు వీచినట్లు తాజా వాతావరణ సమాచారం వెల్లడించింది. తీరం దాటిన అనంతరం అర్నబ్ క్రమంగా బలహీనపడుతూ తీవ్ర తుఫాన్ గా మారింది. తుఫాన్ కేంద్రం ప్రస్తుతం కోస్తాంధ్రపైకి వెళ్లడంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం కొనసాగుతోంది. రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. యానాం-నర్సాపురం మధ్య తీరం దాటిన అర్నబ్ భారత వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. అర్నబ్ తుఫాన్ అక్టోబర్ 28 తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటింది. యానాం నైరుతి వైపు, నర్సాపురానికి ఈశాన్యంగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రం భూభాగంలోకి ప్…