బాపట్లకు తుఫాన్ ఎంత దూరంలో ఉందంటే? రెడ్ అలర్ట్ 100 కి.మీ వేగంతో గాలులు

సైక్లోన్ అర్నబ్ ప్రభావంతో బాపట్ల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయింది. తుఫాన్ బాపట్లకు సమీపిస్తున్న నేపథ్యంలో బలమైన గాలులు, భారీ వర్షాలపై అధికారులు ప్రజలన
బాపట్లకు తుఫాన్ ఎంత దూరంలో ఉందంటే? రెడ్ అలర్ట్ 100 కి.మీ వేగంతో గాలులు
బాపట్లకు తుఫాన్ ఎంత దూరంలో ఉందంటే? రెడ్ అలర్ట్ 100 కి.మీ వేగంతో గాలులు బాపట్ల: సైక్లోన్ అర్నబ్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత జిల్లాలు అప్రమత్తమయ్యాయి. తుఫాన్ క్రమంగా ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో బాపట్ల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. తాజా వాతావరణ సమాచారం ప్రకారం అర్నబ్ తుఫాన్ బాపట్ల వైపు దూసుకొస్తోంది. తుఫాన్ ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి తీర ప్రాంతాల్లో గాలుల వేగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. బాపట్లతో పాటు తీర ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బాపట్లకు తుఫాన్ ఎంత దూరంలో ఉంది? అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం తుఫాన్ బాపట్లకు సుమారు 410 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. అయితే తుఫాన్ వేగంగా తీరానికి చేరువవుతున్నందున దాని ప్రభావం క్రమంగా పెరగవచ్చని అధికారులు సూచించారు. తాజా IMD బులెటిన్ ప్రకారం అర్నబ్ చాలా తీవ్ర తుఫాన్‌గా బలపడింది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment