AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఏపీకి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 25న తీవ్ర వాయుగుండంగా, అక్టోబర్ 26 ఉదయానికి తుపానుగా మారే.
AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఏపీకి భారీ వర్ష సూచన
AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఏపీకి భారీ వర్ష సూచన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 24నాటికి వెల్ మార్క్డ్ లో ప్రెజర్ ఏరియా గా మారింది. ఇది మరింత బలపడి ముందుకు కదిలే అవకాశం ఉంది. 0 తాజా అంచనాల ప్రకారం ఈ వ్యవస్థ అక్టోబర్ 24న డిప్రెషన్‌గా, అక్టోబర్ 25న డీప్ డిప్రెషన్‌గా బలపడే అవకాశం ఉంది. అనంతరం అక్టోబర్ 26 ఉదయం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సైక్లోనిక్ స్టార్మ్‌గా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 28 ఉదయం నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపానుగా మారే అవకాశం ఏపీపై ప్రభావం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాతావరణ వ్యవస్థ బలపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమని వాతావరణ శాఖ హెచ్చరికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్…