రేషన్ షాపుల్లో కందిపప్పు, పామాయిల్ ధరలు తగ్గించాలన్న సీఎం చంద్రబాబు

ఏపీలో నిత్యావసర సరుకుల ధరలను తగ్గించే చర్యల్లో భాగంగా రేషన్ షాపుల్లో కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్‌ను తక్కువ ధరలకు అందించాలని సీఎం చంద్రబాబు.
రేషన్ షాపుల్లో కందిపప్పు, పామాయిల్ ధరలు తగ్గించాలన్న సీఎం చంద్రబాబు
రేషన్ షాపుల్లో కందిపప్పు, పామాయిల్ ధరలు తగ్గించాలన్న సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. మార్కెట్‌లో పెరుగుతున్న ధరలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు అవసరమైన సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తక్కువ ధరలకు బియ్యం, ఉల్లిపాయలు వంటి సరుకులను అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రభుత్వం ఇక రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్ వంటి నిత్యావసర వస్తువులను కూడా రాయితీ ధరలకు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. కందిపప్పు, పామాయిల్‌ను రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై అందించే ప్రణాళికపై గతంలోనే పౌరసరఫరాల శాఖ ప్రకటనలు చేసింది. దీపావళి నాటికి రేషన్ షాపుల్లో కొత్త ధరలు దీపావళి నాటికి రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రతిపాదిత ధరల ప్రకారం కిలో కందిపప్పు రూ.100, కిలో గోధుమ పిండి రూ.25, లీటర్ పామాయిల్ రూ.125 కు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించార…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment