ఏపీలో భారీ వర్షాలు అక్టోబర్ 27, 28న అతిభారీ వర్షాలకు అవకాశం: IMD హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 26 నాటికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని IMD తెలిపింది. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి.
ఏపీలో భారీ వర్షాలు అక్టోబర్ 27, 28న అతిభారీ వర్షాలకు అవకాశం: IMD హెచ్చరిక
ఏపీలో భారీ వర్షాలు అక్టోబర్ 27, 28న అతిభారీ వర్షాలకు అవకాశం: IMD హెచ్చరిక AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అక్టోబర్ 23న ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అక్టోబర్ 26 నాటికి ఈ వ్యవస్థ తుఫానుగా మారే అవకాశం ఉందని, అనంతరం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించే అవకాశం ఉందని తాజా వాతావరణ సమాచారం వెల్లడిస్తోంది. అక్టోబర్ 26 నాటికి తుఫానుగా బలపడే అవకాశం తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. IMD అంచనా ప్రకారం ఈ వ్యవస్థ అక్టోబర్ 24 నాటికి డిప్రెషన్‌గా, అక్టోబర్ 25 నాటికి డీప్ డిప్రెషన్‌గా బలపడే అవకాశం ఉంది. అక్టోబర్ 26 ఉదయం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సైక్లోనిక్ స్టార్మ్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఈ వ్యవస్థ పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల వైపు మరింత బలపడుతూ వెళ్లే అవకాశం ఉందని IMD పేర్కొంది. అయితే ప్రస్తుతం తుఫాను ఎక్…