19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ సుప్రీంకోర్టు ఆదేశాలతో SEC కీలక నిర్ణయం
AP మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 19 పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని
19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ సుప్రీంకోర్టు ఆదేశాలతో SEC కీలక నిర్ణయం
19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ సుప్రీంకోర్టు ఆదేశాలతో SEC కీలక నిర్ణయం AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో తమ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని YSRCP చేసిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను వెంటనే చేపట్టకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకంగా ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించి, నామినేషన్ల గడువు పొడిగించాలా? లేదా? అనే అంశంపై SEC నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఎన్నికల తదుపరి ప్రక్రియపై తాత్కాలికంగా ఉత్కంఠ నెలకొంది. 19 మున్సిపాలిటీల్లో ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ YSRCP ఫిర్యాదులు చేసిన 19 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల తదుపరి ప్రక్రియపై ప్రభావం పడింది. నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా వంటి తదుపరి దశలను తాత్కాలికంగా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీని పరిశీలించిన తర్వాత ఎన్నికల కమిషన్ తదుపరి నిర్ణయం తీసుకో…