SRH Owner: అనిరుధ్-కావ్య పెళ్లి 10 ఏళ్ల ముందే చెప్పారు
అనిరుధ్-కావ్యా మారన్ పెళ్లి ఫిక్స్ కావడంతో గతంలో అనిరుధ్ పాల్గొన్న తంతి టీవీ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది. 10 ఏళ్ల క్రితం చెప్పిన విషయాలు ఇప్పుడు.
SRH Owner: అనిరుధ్-కావ్య పెళ్లి 10 ఏళ్ల ముందే చెప్పారు
SRH Owner: అనిరుధ్-కావ్య పెళ్లి 10 ఏళ్ల ముందే చెప్పారు | Telugu Vaadi TV సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్యా మారన్ పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వీరి పెళ్లికి సంబంధించిన వార్తల నేపథ్యంలో అనిరుధ్ గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. దాదాపు పదేళ్ల క్రితం జరిగిన ఆ ఇంటర్వ్యూలో అనిరుధ్ భవిష్యత్తులో తన వివాహం గురించి చెప్పిన విషయాలను ఇప్పుడు పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం అనిరుధ్ ఏం చెప్పారు? అనిరుధ్ గతంలో తంతి టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఆయన వ్యక్తిగత జీవితం, వివాహానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఈ సందర్భంగా టారో రీడర్ ఆయన లవ్ మ్యారేజ్ చేసుకుంటారని ప్రెడిక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు అనిరుధ్ స్పందిస్తూ అది కరెక్ట్ అన్నట్లుగా సమాధానం ఇచ్చారు. అంతేకాదు, తాను సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని కాకుండా బ్రాడ్‌కాస్టింగ్ రంగానికి చెందిన యువతిని వివాహం చేసుకునే అవకాశం ఉందనే విషయం కూడా ఆ సంభాషణలో ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం కావ్యా మారన్‌తో అనిరుధ్ వివాహానికి సంబంధించిన వార్తలు రావడంతో, అప్పటి వీ…