వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.65 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు Sacnilk తెలిపింది.
వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
ఆదర్శ కుటుంబం ఫస్ట్ డే కలెక్షన్స్: విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – House No. 47 (AK 47)’ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ఖాతాను ఓ మోస్తరు ఓపెనింగ్‌తో ప్రారంభించింది. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు వసూళ్లకు సంబంధించిన అంచనా గణాంకాలను Sacnilk వెల్లడించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.65 కోట్లు Sacnilk బాక్సాఫీస్ ట్రాకింగ్ ప్రకారం.. ‘ఆదర్శ కుటుంబం – House No. 47’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియా నుంచి రూ.11.15 కోట్ల గ్రాస్ రాగా, ఓవర్సీస్ మార్కెట్ల నుంచి రూ.5.50 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఇండియా నెట్ కలెక్షన్స్ విషయానికి వస్తే తొలి రోజు రూ.9.50 కోట్లుగా Sacnilk అంచనా వేసింది. అంటే పన్నులు మినహాయించిన తర్వాత దేశీయ నెట్ వసూళ్లు రూ.9.50 కోట్లుగా ఉన్నాయి. 44.1 శాతం ఆక్యుపెన్సీ తొలి రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా 3,073 షోలలో ప్రదర్శితమైనట్లు Sacnilk తెలిపింది. ఈ షోలకు సగటున 44.1 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు పేర్కొంది. రోజు గడిచే కొద్దీ ఆక్యుపెన్సీలో పెరుగుదల కనిపించింది. మ…