Pitaapuram రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయండి: కేంద్ర రైల్వే మంత్రిని కోరిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని, రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకంలో చేర్చాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని.
Pitaapuram రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయండి: కేంద్ర రైల్వే మంత్రిని కోరిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం సహా పలు కీలక అంశాలపై చర్చించారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధిపై వినతి పిఠాపురం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన పట్టణమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి, రైల్వే శాఖ అమలు చేస్తున్న అమృత్ స్కీం కింద పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన పిఠాపురం, అలాగే శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి కొలువైన క్షేత్రం కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్‌లో ఆధునిక మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకంలో చేర్చాలని అభ్యర్థన సేతు బంధన్ పథకం కింద ఇప్పటికే మంజూరు అయిన పిఠాపురం రోడ్డు ఓవర్ బ్రిడ్జి ప్రాజెక్టును పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.…