రేపటి నుంచి పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి పర్యటన

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులపాటు పిఠాపురంలో పర్యటించనున్నారు. సంక్రాంతి మహోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, శాంతి
రేపటి నుంచి పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి పర్యటన
రేపటి నుంచి పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి పర్యటన • 9వ తేదీన సంక్రాంతి సంబరాలకు శ్రీకారం • పిఠాపురం వేదికగా ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’ • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు • 10వ తేదీ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం • పిఠాపురం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి సందర్శనలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గురువారం రాత్రికి పిఠాపురం చేరుకోనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శుక్రవారం ఉదయం పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఉదయం గం.10.30ని.కి ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. ఉదయం గం.11.30 నిమిషాలకు నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్లను తిలకిస్తారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపునకు గురైన ఇందిరానగర్ కాలనీ,  …