Pawan kalyan in Pithapuram: జూదం, పందెం భోగిమంటల్లో కాలాలి.. ఆచారం, సంప్రదాయం సంక్రాంతి వేళ వెలగాలి

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పితికాపుర సంక్రాంతి మహోత్సవాన్ని ప్రారంభించారు, జూదం కంటే సాంస్కృతిక వేడుకలను జరుపుకున్నారు, పిఠాపురంలో రూ .1
Pawan kalyan in Pithapuram: జూదం, పందెం భోగిమంటల్లో కాలాలి.. ఆచారం, సంప్రదాయం సంక్రాంతి వేళ వెలగాలి
• భావి తరాలకు సంక్రాంతి గొప్పదనాన్ని తెలిపేలా పండుగ చేసుకుందాం  • సంక్రాంతి ఉత్సవాలకు పిఠాపురం చిరునామా కావాలి  • పిఠాపురంలో పోటీ చేయడం భగవంతుడి సంకల్పం • ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెడితే ఉపేక్షించను • లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి  • పొత్తులను బలహీనపరిచేలా కూటమి నాయకులు మాట్లాడొద్దు • అభివృద్ధికి కేరాఫ్ గా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతా • బూతులు తిట్టడం, కేసులు పెట్టడం తప్ప వైసీపీ చేసింది ఏమీ లేదు  • పిఠాపురంలో “పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను” ప్రారంభించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు   • రూ. 186 కోట్ల విలువైన  పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు      తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో... అదే విధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. సంక్రాంతి అనేది ప్రత్యేకంగా ఒక మతానికి నిర్దేశించిన పండుగ కాదని, మన సనాతన ధర్మ మూలాల్లో చెప్పే ప్రకృతి ఆరాధ…