#GreatGreenWallOfAndhraPradesh: భూ మాతను రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచాలి

భూమి పరిరక్షణతో పాటు రైతుల ఆదాయం పెంచే విధంగా ఉద్యాన సాగులో వైవిధ్యం తీసుకురావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. 2047 నాటికి 50 శాతం.
#GreatGreenWallOfAndhraPradesh: భూ మాతను రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచాలి
• ఉద్యాన సాగులో వైవిధ్యం… భూమికి రక్షణ కవచం లాంటిది • విభిన్న రకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి • 50 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికల అమలులో ఉద్యాన శాఖ పాత్ర కీలకం • అటవీ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan భూ మాతను రక్షించుకుంటూ, రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచడంతోపాటు వాతావరణాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో 50 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికలపై అటవీ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ అంశాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్యల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది.  గ్రీన్ కవర్ పెంపులో ఉద్యాన శాఖ పాత్ర, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం తదితర అంశాలపై ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడుతూ “గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2047 నాటిక…