పూర్వం రాజ్యాలు రాజులు పాలన ఉండేది అక్కడ వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిన మాట మాత్రమే చెల్లుతుంది అలా సింధు రాజ్యం లోని రాజు ఆయన కిరీట మహారాజు ఉండే వాడు పేరు ఇంకా తలపైన కిరీటం ఉన్న బుద్ధి లో మాత్రం పరమ రాక్షసుడు
ఆ రాజ్యం లో ఎన్నో జాతుల వాళ్ళు ఎన్నో కులాల వాళ్ళు ఉన్నారు ఆ రాజ్యం లో జాతిని కులాన్ని బట్టి పాలన ఉంటుంది ఎక్కువ కులం వాడికి సకల సౌకర్యాలు ఉంటాయి కానీ తక్కువ జాతి కులం వాళ్ళు కి మాత్రం అన్ని బాధలు మాత్రమే ఉంటాయి అలా ఆ రాజ్యం లో ఉన్న తక్కువ జాతి లో వీరి బాధ భరించలేకుండా దూరం వెళ్ళి పోవాలి అనుకుంటే వారికి మిగిలేది చావు మాత్రమే అలా వెళ్ళిపోవాలి అనుకుని ప్రయత్నం చేసిన వారిని వెంటాడి వెంటాడి చంపాడు ఆ రాజు ఆ రాజు చేతిలో చావలేక చాలా మంది బలవంతం గా ప్రాణం తీసుకున్నారు
ఆ రాజుకి మనుషుల ప్రాణాలు తీయడం అంటే అంత సరదా ఇలా ఆ దేశం లో తక్కువ జాతి అని రాజు అనుకునే ప్రజలను చిత్ర హింసలకు గురి చేసే వాడు వాటిని తట్టుకోవడం వారి వల్ల అయ్యేది కాదు అలా చాలా రోజుల తర్వాత వారి లో ఒక చైతన్యం వచ్చింది ఆ రాజుని ఎలా అయినా చంపాలి అని అనుకున్నారు
ప్రజలలో బలం వచ్చినప్పుడు రాజులు అయిన రాజ్యాలు అయిన కూలి పోతాయి అలా రాజు చేతిలో చావడం కన్నా ఆ రాజు నీ లేకుండా చేస్తే ఈ బాధలు ఉండవు అని ఆలోచి చి 10 మంది సమూహం గా మారి ఆ రాజు నీ చంపాలి అని నిర్ణయం తీసుకున్నారు అవకాశం ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూసే వారు అలా ఒక రోజు రాజు అడవి లో వేట కి వెళ్తున్నాడు అని వాళ్ళకి తెలిసింది ఆ 10 మంది ఒక చోట చేరి మాట్లాడుకున్నారు అందులో కొందరికి ఇది నచ్చలేదు కానీ అందులో ఉన్న రాముడు అనే వ్యక్తి మాత్రం ఈ రోజు ఎలా అయినా చంపాలి అని పట్టు పట్టుకొని కూర్చున్నాడు ఎవరు చెప్పిన వినలేదు.
వారు అందరూ వినకపోవడానికి కారణం రాజు వెళ్తుంది వేట కి అతని దగ్గర ఆయుధాలు ఉంటాయి ఈ చిన్న తేడా జరిగిన జాగ్రత్త పడతాడు అందుకు వద్దు అని అంటారు కానీ ఎవరు ఎంత చెప్పిన రాముడు వినడు అందరూ నచ్చజెప్పి రాముడి నీ తీసుకొని వెళ్ళి పోతారు
రాజు వేట కు సిద్ధం అవుతాడు అడవిలోకి వెళ్తాడు రాముడు ఇంకో ఇద్దరిని తీసుకొని ఎవరికి తెలియకుండా రాజు నీ వెంబడిస్తూ వెళ్తాడు అలా చాలా దూరం అడవిలోకి వెళ్ళక రాముడు తన తో వచ్చిన వారి నీ ఒక చోట దాగి ఉండమని చెప్పి ఒక్కడే వెళ్తాడు అలా రాజు ఒక చెట్టు చాటు లో ఉండి వేట కోసం సిద్ధం గా ఉన్నది రాజు తో పాటు అతని కాపలా దారులు కూడా ఉన్నారు కానీ రాముడు దైర్యం చేసి రాజుని చంపాలి అని వెళ్తాడు వెనుక నుండి ఇద్దరు కపాల దారులను చంపేస్తాడు మూడవ వ్యక్తి నీ చంపే లోపు రాజు రాముడిని చంపేస్తాడు
రాముడు తో వచ్చిన వాళ్ళు ఇది చూసి అక్కడి నుండి పారిపోతారు రాజు కూడా ప్రమాదం ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు రాముడికి సంబంధించిన వారిని వారి జాతి మొత్తాన్ని పిలిచి చిత్ర హింసలు పెట్టాడు ఒక్కడు చేసిన తప్పు కి అందరికీ శిక్ష వేశాడు అలా వారు రాజు పెట్టే బాధలు భరించలేక అందరూ ఒక రోజు రాత్రి కూర్చుని మాట్లాడుతున్నారు రాజు ఆకృత్యాలు ఒక్కొకటి గా మాట్లాడుతున్నారు దానికి రాజీ నాయకుడు అందరు కలిసి రాజు నీ ఎలాగైనా అణచి వేయాలి అని నిర్ణయం తీసుకున్నారు అలా అందరూ కలిసి సమయం కోసం ఎదురు చూస్తున్నారు రాజు గారి ఇంట్లో ఒక్కొక్కరు పనిచేయడం మొదలుపెట్టారు కొన్ని రోజులకు రాజుకు కూడా భయం పుట్టడం మొదలుపెట్టింది రాజ్యంలో కూడా రాజుకు వ్యతిరేకంగా రాజు చేస్తున్నటువంటి అన్యాయమైన పనులకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడటం మొదలుపెట్టారు ప్రజా వ్యతిరేకతను చూసి రాజుకు కూడా చాలా భయం వేయడం మొదలుపెట్టింది ఎలాంటి భయం అంటే తను తినే ఆహారం కూడా ఎక్కడ విషపూరితమై ఉంటుందో అని చేసిన వ్యక్తి మొదటి తిన్న తరువాతే రాజు తినడం మొదలుపెడతాడు కానీ వీళ్లు మాత్రం రాజును చంపడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నారు
ఇలా జరుగుతున్న సమయంలో ఒక రోజు రాజు కన్ను నాట్యం చేసే ఆమెపై పడింది ఎలాగైనా అమ్మను తన మోసం చేసుకోవాలని రాజు ఆమె ను లో బరుచుకున్నాడు కొన్ని రోజులకు ఆమె కూడా లొంగి పోయింది ఈ విషయం తెలుసుకున్న రాజి ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిందని సంబరపడిపోయాడు ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకు సాగాడు ముందుగా ఆమెను పిలిపించి విషయం చెప్పాడు వారికి సహాయం చేయవలసిందిగా కోరాడు రాజు అంటే అసహ్యంగా ఉన్న ఆమె కూడా దాని ఒప్పుకుంది
ఆ మందిరంలోకి ప్రవేశించడానికి వారికి సహాయం చేసింది వారు ఆమె సహాయంతో ముందుగానే రాజు యొక్క అంత మందిరంలో దాక్కుని ఉన్నారు రాజు రాక కోసం ఎదురు చస్తున్నారు అలా రాజు మందిరం లోపలికి రాగానే అందరూ కలిసి ఒక్కసారిగా దాడి చేశారు చిన్న శబ్దం కూడా బయట వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు వచ్చిన పని ముగించుకున్నారు రాజును చంపి అక్కడి నుంచ వచ్చిన దారిలోనే జాగ్రత్తగా తప్పించుకొని బయటపడ్డారు మరుసటి రోజు రాజు చనిపోయిన విషయం అందరికీ తెలుసు రాజ్యంలో సంబరాలు చేసుకున్నారు రాజు చేసిన అన్యాలకు ఆకృత్యాలకు కనీసం రాజు శవాన్ని కూడా ఎవరూ రాలేదు అది కాకులు గద్దల కి ఆహారం అయింది
రాజ్యం చేతిలో ఉందని తను చెప్పిందే వేదం అని విర్రవీగితే చివరకు ఆ రాజ్యంలో నిన్ను పోడ్చడానికి చిన్న స్థలం కూడా దొరకదు
మీ
జ్యోతి ప్రసాద్ చల్లగుండ్ల