ట్రివిక్రమ్ – వెంకటేష్ కాంబినేషన్ గ్రాండ్ లాంచ్.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కన్ఫర్మ్!
Trivikram Srinivas teams up with Venkatesh for the first time. Srinidhi Shetty confirmed as lead. Grand launch done, shoot starts Oct 6.
ట్రివిక్రమ్ – వెంకటేష్ కాంబినేషన్ గ్రాండ్ లాంచ్.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కన్ఫర్మ్! టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఒకటి ఎట్టకేలకు నిజమైంది.
మాటల మాంత్రికుడు ట్రివిక్రమ్ శ్రీనివాస్ – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా
గ్రాండ్ లాంచ్ అయింది. హైదరాబాద్‌లో సింపుల్ కానీ ఎలిగెంట్ పూజా కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో సినిమా టీమ్ తో పాటు కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా హారికా & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది.
ఇప్పటివరకు ట్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా రాకపోవడం విశేషం.
ఒకప్పుడు “నువ్వు నాకు నచ్చావ్” వంటి హిట్ సినిమాకు ట్రివిక్రమ్ డైలాగ్స్ రాయగా,
ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వెంకీ మొదటిసారి కనిపించబోతున్నారు. సినిమా షూట్ అక్టోబర్ 6 నుండి మొదలవుతుంది .
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దాదాపు పూర్తయింది.
స్క్రిప్ట్ విషయంలో ట్రివిక్రమ్ తనకు తెలిసిన హ్యూమర్, ఫ్యామిలీ ఎమోషన్స్,
అలాగే ఈ సారి స్పెషల్‌గా డార్క్ క్రైమ్ యాంగిల్ కలిపారని తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ కన్నడ బ్యూటీ, KGF సిరీస్ ద్వారా పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి
ఈ చిత్రంలో హీరోయిన్‌గా…