
థలపతి విజయ్ ఇంటి భద్రతపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, 24 ఏళ్ల మానసిక సమస్యలున్న వ్యక్తి విజయ్ ఇంటి టెర్రస్ పైకి చేరుకున్న ఘటన కలకలం రేపింది.
విజయ్‌కు ప్రస్తుతం ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ ఉండగా, అలాంటి సమయంలో ఒక వ్యక్తి సులభంగా టెర్రస్ పైకి చేరుకోవడం అనేక సందేహాలకు కారణమవుతోంది. “ఇంత గట్టి భద్రత ఉన్నా ఈ లోపం ఎలా జరిగింది?” అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
అతడు నిజంగా విజయ్‌ను అభిమానంతో చూడటానికే వచ్చాడా? లేక రాజకీయ పంథాలో ఎవరైనా పంపించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. CCTV ఫుటేజ్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించి విచారణ జరపాలి అని డిమాండ్లు వస్తున్నాయి.
ఇటీవల విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దాంతో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు కూడా “థలపతి ఇక సాధారణ నటుడు కాదు, నాయకుడు కూడా. భద్రతను రెట్టింపు చేయాలి” అని పోస్ట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి 👉 యశ్ Toxic సినిమా షూట్ సమస్యల్లో?
భారతదేశంలో రాజకీయాల్లోకి వచ్చిన సినీ ప్రముఖులు ఎప్పుడూ ప్రత్యేక భద్రత అవసరం అవుతుంది. ముఖ్యంగా థలపతి విజయ్లాంటి పాన్-ఇండియా స్టార్ విషయంలో భద్రతా ప్రమాణాలు మరింత కఠినంగా ఉండాలి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.