దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు చుట్టూ మరోసారి సంచలన చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో X (Twitter)లో ఒక ఖాతా ఆయన పేరుతో షాకింగ్ పోస్ట్ చేసింది. ఆ ట్వీట్‌లో కేవలం “😂😂😂😂” అనే ఎమోజీలను షేర్ చేశారు. ఈ ఒక్క రియాక్షన్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
తాజాగా దీపికా పడుకొనేకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో భాగం కాదని Vyjayanthi Movies అధికారికంగా ప్రకటించింది. అలాగే, Spirit సినిమా నుంచి కూడా ఆమె తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో వంగా పేరుతో వచ్చిన ఈ ఎమోజీ ట్వీట్ నెటిజన్లలో అనేక రకాల అర్ధాలు తెచ్చుకుంది.
అయితే క్లారిటీగా చెబితే, ఈ ట్వీట్ అసలు సందీప్ రెడ్డి వంగా అధికారిక ఖాతా నుండి రాలేదు. ఇది ఒక ఫేక్ అకౌంట్ నుండి పోస్ట్ అయినట్లు బయటపడింది. అయినా కూడా అభిమానులు “వంగా నిజంగానే ఇలా రియాక్ట్ చేసారా?” అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ పోస్ట్‌ను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఈ సంఘటన ఒకవైపు దీపికా పడుకొనే ప్రాజెక్టుల నుంచి వైదొలగడం, మరోవైపు సందీప్ రెడ్డి వంగా సినిమా ‘Spirit’పై కొత్త అనుమానాలకు దారితీస్తోంది. అసలు ట్వీట్ ఫేక్ అని తెలిసినా, ఈ చిన్న రియాక్షన్ కూడా అభిమానుల్లో ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో ఈ ఎపిసోడ్ మరోసారి నిరూపించింది.