రేపు పవన్ కళ్యాణ్ ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్ – హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు పవన్ కళ్యాణ్ ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్ – హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Pawan Kalyan’s OG pre-release event to be held tomorrow at LB Stadium, Hyderabad. Police announce traffic diversions in key areas.
రేపు పవన్ కళ్యాణ్ ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్ – హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రియాంకా మోహన్ కాంబోలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన OG మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈవెంట్ LB స్టేడియం లో రేపు (సెప్టెంబర్ 22) సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10:30 వరకు జరుగుతుంది. భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు: రవీంద్రభారతి జంక్షన్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ బషీర్ బాగ్ BJR స్టాట్యూ సర్కిల్ పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పోలీసులు కొన్ని రోడ్లపై ఆంక్షలు విధిస్తున్నారు. అభిమానులు తమ వాహనాలు అనుమతించబడిన ప్రదేశాల్లో మాత్రమే పార్క్ చేయాలని సూచించారు. అదేవిధంగా ఈవెంట్ కు వచ్చే వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ను వాడుకోవాలని కోరారు. ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, ప్రియాంకా మోహన్ తో పాటు మొత్తం మూవీ టీమ్ పాల్గొననున్నారు. ప్రత్యేక అతిథులుగా టాలీవుడ్ ప్రముఖులు కూడా రావచ్చనే సమాచారం వినిపిస్తోంది. …