మృనాల్ లవ్ లో బ్రేకప్ అతడు ఎవరో తెలుసా?

‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ గతంలో స్క్రిప్ట్ రైటర్ **** రిలేషన్‌లో ఉన్నారని టాక్. ఇప్పుడు బ్రేకప్ వార్తలతో అభిమానుల్లో చర్చ ముదురుతోంది.
Mrunal Thakur Latest News
మృణాల్ ఠాకూర్ బ్రేకప్ వార్తలతో హాట్ టాపిక్

‘సీతారామం’ సినిమాలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తోంది. టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, తరువాత బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో ‘సీతారామం’ తరువాత ‘హాయ్ నాన్న’ ద్వారా మరో విజయాన్ని సాధించిన మృణాల్, ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ‘ది ఫ్యామిలీ స్టార్’లో నటించింది. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘డెకాయిట్’ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించబోతోంది.

ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే — గతంలో ప్రముఖ టీవీ స్క్రిప్ట్ రైటర్ శరద్ త్రిపాఠితో రిలేషన్‌లో ఉన్నారని సమాచారం. అప్పట్లో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారని, కానీ కాలక్రమేణా ఆ బంధం ముగిసిందని టాక్. శరద్ త్రిపాఠి ‘కసౌటి జిందగీ కి’, ‘స్వరాగిణి’, ‘క్యూకీ సాస్ భీ కభీ బహు థీ’ వంటి సీరియల్స్‌కి రచనలు చేసి పేరు తెచ్చుకున్నారు. తరువాత సినిమాలకు కూడా స్క్రిప్ట్ రాశారు. పాటలు రాసే ప్రతిభ కూడా ఉన్న ఆయన, ఏక్తా కపూర్‌తో వృత్తిపరమైన అనుబంధాలు కలిగి ఉన్నారు.

ఇద్దరి విడిపోవడంపై ఇంకా స్పష్టత రాకపోయినా, అభిమానులు మాత్రం "మృణాల్ లవ్ బ్రేకప్ నిజమేనా?" అంటూ ఆతృతగా చర్చించుకుంటున్నారు. మరోవైపు మృణాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో "తనకి విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం" అని చెప్పడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.