ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ‘మా వందే’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం టాప్-నాచ్ టెక్నీషియన్స్ జట్టులోకి చేరారని మేకర్స్ ప్రకటించారు.
ఇది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతుండగా, అన్ని భారతీయ భాషల్లోనే కాకుండా, ఇంగ్లీష్‌లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. మోడీ జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఆయన రాజకీయ ప్రస్థానం, దేశ నిర్మాణంలో ఆయన పాత్రను ఈ చిత్రంలో చూపించనున్నారని సమాచారం.
దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ‘మా వందే’కు విపరీతమైన క్రేజ్ ఉంటుందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
మొత్తానికి, ప్రధాని మోడీ బయోపిక్ ‘మా వందే’ ఇండియన్ సినిమా చరిత్రలో మరో పెద్ద ప్రాజెక్ట్‌గా నిలవనుందని ఇప్పటికే స్పష్టమవుతోంది.