లోకేష్ కనగరాజ్ రెండు పెద్ద సినిమాలు డ్రాప్.. కారణం ‘కూలీ’ ఫలితం?
బ్రేకింగ్: లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయాల్సిన ఆమిర్ ఖాన్ సినిమా, రజినీకాంత్–కమల్ హాసన్ ప్రాజెక్ట్ డ్రాప్. కారణం ‘కూలీ’ ఫలితమేనా?
లోకేష్ కనగరాజ్ రెండు పెద్ద సినిమాలు డ్రాప్.. కారణం ‘కూలీ’ ఫలితం? లోకేష్ కనగరాజ్ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా తనదైన మార్క్‌ను సెట్ చేసుకున్నాడు. కానీ తాజాగా అతను డైరెక్ట్ చేయాల్సిన రెండు భారీ సినిమాలు డ్రాప్ అయినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్స్‌లో ఒకటి ఆమిర్ ఖాన్ సినిమా కాగా, మరొకటి సూపర్‌స్టార్ రజినీకాంత్ – కమల్ హాసన్ మల్టీ స్టారర్. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండు ప్రాజెక్ట్స్‌ను రద్దు చేసే ప్రధాన కారణం ఇటీవల విడుదలైన ‘కూలీ’ సినిమా ఫలితమేనని చెబుతున్నారు. ‘కూలీ’ ఊహించినంత స్థాయిలో కలెక్షన్లు సాధించకపోవడంతో, ఇండస్ట్రీలో లోకేష్ మీద ఒత్తిడి పెరిగిందని టాక్. అయితే, దర్శకుడు ప్రస్తుతం ఆరుణ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఆ తర్వాత మాస్ హిట్ మూవీ ‘ఖైది 2’ ని హీరో కార్తీ తో మొదలు పెట్టనున్నారు. లోకేష్ సెట్ చేసిన LCU (Lokesh Cinematic Universe) కి ఈ నిర్ణయం షాక్‌గా మారింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆయన మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని నమ్ముతున్నారు.