సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మువీపై మళ్లీ ఫుల్ హైప్ క్రియేట్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుండి కేరళలోని పాలక్కాడ్‌లో ప్రారంభం కానుంది.
ఈ షెడ్యూల్లో రజనీకాంత్‌తో పాటు పలువురు మలయాళీ నటులు కూడా పాల్గొనబోతున్నారు. స్థానిక కల్చర్‌కి దగ్గరగా ఉండేలా ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరించేందుకు యూనిట్ ప్లాన్ చేసింది. కేరళలోని అందమైన లొకేషన్లలో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
మొదటి భాగమైన జైలర్ సూపర్ హిట్ అవడంతో, రెండో పార్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మళ్లీ రజనీకాంత్ స్క్రీన్ పై తన మాస్ స్టైల్ చూపించబోతున్నారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మొత్తానికి, జైలర్ 2 ఈ కొత్త షెడ్యూల్ ప్రారంభంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. రాబోయే నెలల్లో మూవీ యూనిట్ నుండి మరిన్ని అప్డేట్స్ రావొచ్చని సమాచారం.