భారీ షాక్! పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898AD’ సీక్వెల్ నుండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మేకర్స్ ప్రకటన ప్రకారం: “దీర్ఘకాలిక ప్రయాణం చేసినప్పటికీ, సీక్వెల్‌కి అవసరమైన కట్టుబాటు మరియు భాగస్వామ్యం కుదరలేదు. ఇలాంటి చిత్రం అంతకన్నా ఎక్కువ అంకితభావాన్ని అర్హిస్తుంది” అని పేర్కొన్నారు. దీపికా భవిష్యత్ ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898AD’ సీక్వెల్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. దీపికా తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ఎవరని అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యాన్స్ మాత్రం ఈ సీక్వెల్ ఎవరితో ముందుకు వెళ్తుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.