ఈ దసరా టాలీవుడ్ బాక్సాఫీస్‌లో భారీ క్లాష్ కచ్చితమైంది. ఒక వైపు పవన్ కళ్యాణ్ నటించిన “OG”.. మరో వైపు రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న “కాంతారా ఛాప్టర్ 1”.
OG సినిమాకి ఇప్పటికే రికార్డు స్థాయిలో థియేట్రికల్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. అలాగే USAలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా హిస్టారికల్ లెవల్‌లో సాగుతున్నాయి. అయితే ప్రమోషన్స్ విషయానికి వస్తే సినిమా టీమ్ తక్కువగా చేస్తూ.. ట్రైలర్ను రాబోయే రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఇక కాంతారా ఛాప్టర్ 1 విషయానికి వస్తే.. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ అప్‌డేట్ రాకపోయినా.. సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ముఖ్యంగా రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన ఒరిజినల్ యూనివర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
మొత్తానికి, ఈ దసరా బాక్సాఫీస్‌పై OG Vs Kantara Chapter 1 పోటీ రికార్డులను బద్దలు కొట్టే స్థాయిలో ఉంటుందని అనిపిస్తోంది. ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి!